మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’. ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ్ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. విశ్వక్ సేన్ తొలిసారి ఈ సినిమాలో లేడీ గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ అంచనాలను మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో టీమ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చాలా గ్రాండియర్‌గా నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ “ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. కచ్చితంగా లైలా మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. ట్రైలర్ బయటకు వచ్చింది కాబట్టి.. నాకంటే ట్రైలర్ ఎక్కువ మాట్లాడాలని అనుకుంటున్నా.
ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి అక్కడ మాట్లాడుతా. లైలా నుంచి నెక్స్ అటక్ పటక్ సాంగ్ రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్ నేనే రాశా. అది కూడా మీకు నచ్చుతుంది. నేను ఈ సినిమాలో లేడీ గెటప్ వేసింది ఎంటర్‌టైన్ చేయడానికి. అందులో భాగంగానే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. యూత్‌కు పవర్‌ప్యాక్డ్‌గా సినిమా ఉంటుంది. ఫిబ్రవరి 14న అందరం థియేటర్లలో కలుద్దాం” అని చెప్పారు.
డైరెక్టర్ రామ్ నారాయణ్ మాట్లాడుతూ “లైలా సినిమాలో పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది”అని తెలిపారు. నటి కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ “ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అందుకే టీజర్, ట్రైలర్‌లో ఎక్కడా చూపించలేదు. కామాక్షి అంటే చాలా ఇంటెన్స్ రోల్స్ చేస్తుందనే మార్క్ ఉంది. ఆ మార్క్‌కు తగ్గట్లే ఇందులో నా పాత్ర ఉంటుంది. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ రామ్ నారాయణ్‌దే”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సాహు గారపాటి, డ్యాన్స్ మాస్టర్ భాను పాల్గొన్నారు.