Friday, February 7, 2025

ఎఆర్ ఎస్ఐ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ములుగు: ఎఆర్ ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలోని పస్రా గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మాణిక్యారం గ్రామానికి చెందిన సువర్ణ పాక లక్ష్మీ నర్సు(36) అనే వ్యక్తి టిజిఎస్‌పి 15వ బెటాలియన్‌లో ఎఆర్ ఎస్‌ఐగా పని చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టెవాడకు చెందిన వినోద అనే యువతిని కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. గోవిందరావు పేట మండలం రాఘవపట్నం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఆమె సేవలందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌లో లక్ష్మీనర్సు విధులు నిర్వహిస్తున్నారు. గత పది సంవత్సరాల నుంచి దంపతులు పస్రాలో నివాసం ఉంటున్నారు.

దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఓ వేడుకకు హాజరై ఇంటికి చేరుకున్న దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్యను ఇంటి నుంచి భర్త బయటకు గెంటేశాడు. ఆమె తన పుట్టినిళ్లు హనుమకొండకు వెళ్లిపోయింది. గురువారం తెల్లవారుజామున తన భర్తకు భార్య పలుమార్లు ఫోన్ చేసినప్పటికి తీయకపోవడంతో పక్కింటి వారికి పోన్ చేసి సమాచారం ఇచ్చింది. మరో గదిలో నాన్న పడుకున్నాడని ఇంకా నిద్ర నుంచి మేల్కోలేదని సమాచారం ఇవ్వడంతో పలుమార్లు డోర్ తట్టారు. రూమ్‌లో నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో కిటికీ అద్దాలు పగులగొట్టి చూడగా లక్ష్మీనర్సు ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. పక్కింటి వారి సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News