Friday, February 7, 2025

పిఎస్‌కు వచ్చిన మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితురాలిని పరిచయం చేసుకొని.. మాయ మాటలతో నమ్మించి ఆమెపై ఓ కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ సంగటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ రెడ్డి కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. డబ్బుల విషయంలో తనని కొందరు ఇబ్బంది పెడుతున్నారని గత ఏడాది మార్చి 21న మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి  ఆమెను నమ్మించాడు.

కేసు విషయమై ఫోన్ చేసిన యువతిని లాయర్‌తో మాట్లాడుదాం అని ఇంటికి పిలిపించుకొని తనకి పెళ్లి కాలేదని మాయ మాటలు చెప్పి ఆమెపై కానిస్టేబుల్ సుధాకర్ లైంగిక దాడి చేశాడు. తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని ఇంటికి తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆగస్టులో కానిస్టేబుల్‌కి పెళ్ళైందని తెలిసి, తాను మోసపోయానని గ్రహించి నిలదీసిన యువతిని అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నాడు. ఒక రోజు యువతి ఇంటికి వెళ్లి బలవంతంగా ఫినాయిల్ తాగించాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెను ఇంటికి పిలిపించుకుని దాడి చేశాడు. మరోసారి బండిపై ఎక్కించుకొని కిందకి తోసి ఇలా పలుమార్లు యువతిపై దాడి చేశాడు. సదరు మహిళ గర్భవతి కావడంతో అబార్షన్ కోసం ఆమెపై కానిస్టేబుల్ తన భార్య, స్నేహితుడితో కలిసి దాడి చేసి మందులు మింగించారు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సదరు కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సుధాకర్ రెడ్డి భార్య సింధూజ, స్నేహితుడు కళ్యాణ్ గౌడ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News