హైదరాబాద్: బిసిల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా? అని ఎంఎల్ సి తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై ఎంఎల్ సి తీన్మార్ మల్లన్న అలియాస్ సిహెచ్ నవీన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పు అంటున్నారని, యుపిఎ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయలేదా? అని ఎదురు ప్రశ్నించారు. కులగణనలో ఉన్న వ్యక్తులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ క్లియర్‌గానే ఉందని, రేవంత్ ప్రభుత్వం క్లియర్‌గా లేదని మండిపడ్డారు. కులగణన నివేదికను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. కొందరు నేతలు బిసిలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు. బిసిలను అణచివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. షోకాజ్ నోటీసులపై ఈనెల 12లోగా ఆలోచన చేస్తానని, బిసి సమాజంతో మాట్లాడి నోటీసులపై సమాధానం ఇస్తానని తీన్మార్ మల్లన్న వివరణ ఇచ్చారు. బిసి కుల గణన నివేదికపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై టిపిసిసి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
కాంగ్రెస్ క్లియర్‌గానే ఉంది… ప్రభుత్వం క్లియర్‌గా లేదు: తీన్మార్ మల్లన్న
- Advertisement -
- Advertisement -
- Advertisement -