Friday, February 7, 2025

సోనుసూద్‌కు అరెస్టు వారెంట్ జారీ..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటుడు సోనుసూద్‌కు పంజాబ్ లుధియానా కోర్టు బిగ్ షాకిచ్చింది. ఓ మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో సోనుసూద్‌కు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. లుథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖాన్న తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో సోనుసూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు.

అయితే ఎన్నిసార్లు సమన్లు పంపినా అతను కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. అరెస్ట్ వారెంట్ పై తాజాగా సోనూసుద్ స్పందించారు. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరమని పేర్కొన్నాడు. ఫిబ్రవరి 10న పూర్తి వివరాలు వెల్లడిస్తానని.. తన అభిమానులు కంగారు పడవద్దని సోనూసుద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News