- Advertisement -
మహా కుంభమేళాలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ కు రోజూ కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో సెక్టార్-18 శంకరాచార్య మార్గ్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. చుట్టు ప్రక్కలే ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఇప్పటికే రెండుసార్లు కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది. పలు టెంట్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి. మరోసారి ప్రమాదం జరగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే.. ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందకు పైగా భక్తులు గాయపడిన సంగతి తెలిసిందే.
- Advertisement -