- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో హైదర్షా కోట్లో గ్యాంగ్రేప్ జరగింది. రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడతున్నారు. బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు కామాంధులను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురి నిందితులపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
- Advertisement -