శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన స్పైస్జెట్ ఫ్లైట్లో సాంకేతిక సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఉదయం 9గంటలకి వెళ్లాల్సిన విమానం.. టెకాఫ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇక, విమానంలో హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నట్లు సమాచారం.
రూ. 30 వేలు పెట్టి టికెట్ కొన్నా.. ఇప్పటి వరకు విమానం టేకాఫ్ కాలేదని ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సాయంత్రం 4 గంటలకు వెళ్తుందని ప్రయాణికులకు యాజమాన్యం స్పష్టం చేసింది. కాగా, ఇటీవల శంషాబాద్ నుంచి రేణిగుంట వెళ్లాల్సిన విమానంలోనూ సాంకేతిక లోపం కారణంగా చాలా ఆలస్యంగా టేకాఫ్ అయ్యింది. ఇలాంటి ఘటనలు ఈ మధ్య శంషాదబాద్ ఎయిర్ పోర్ట్‌లో తరుచూ జరుగుతున్నా అధికారులు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలేదు.