- Advertisement -
తిరుమలలో ఎవరూ ఊహించని ఘోరం జరిగింది. ఆపదమొక్కులవాడు కొలువుదీరిన తిరుమల కొండపై దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. తిరములలోని నందకం అతిథి గృహంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గెస్ట్‌హౌస్‌లోని రూమ్. నం.203లో తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయుడు(60), ఆయన భార్య అరుణ(55) చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు.
ఈ దంపతులు గురువారం ఉదయం రూమ్ తీసుకున్నారు. అయితే, వారు రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో టిటిడి సిబ్బందికి అనుమానమొచ్చి కిటికీలు తెరిచి చూశారు. దాంతో వారు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కావాల్సి ఉంది. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.
- Advertisement -