Saturday, February 8, 2025

భారతీయ విస్కీ ‘ఇంద్రీ’కి స్విస్ మంత్రి ప్రశంసలు: పియూష్ గోయెల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: యూరొపియన్ మార్కెట్‌లో భారతీయ విస్కీ ‘ఇంద్రీ’కి మంచి డిమాండ్ ఉందని ఓ స్విస్ మంత్రి అనడం తనని ఆశ్చర్యానికి గురిచేసిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయెల్ శుక్రవారం రాజ్యసభ సమావేశంలో తెలిపారు. జూరిచ్‌లో నేను స్విస్ మంత్రితో భేటీ అయినప్పుడు ఆయన నాతో ‘ప్రపంచంలో ప్రసిద్ధం అయిన భారతీయ విస్కీ ‘ఇంద్రీ’ యూరొప్ షెల్ఫ్‌లోకి రావడంలేదు’ అని అన్నారని పియూష్ గోయెల్ వివరించారు. రాజ్యసభ ప్రశ్నోత్తర సమయంలో యూరొపియన్ యూనియన్ వాణిజ్య అవరోధాలపై ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు.

‘నేను విస్కీ త్రాగే వాడిని కాను. కానీ స్విస్ మంత్రి భారత విస్కీ లభించడంలేదని అనడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా భారతీయ విస్కీ ‘ఇంద్రీ’ ప్రీమియం ధరలో లభిస్తోందని ఆయన సభకు వివరించారు. వివరాల్లోకి వెళితే…సింగిల్ మాల్ట్ విస్కీ ‘ఇంద్రీ’ హర్యానాలోని ఇంద్రీ అనే చిన్న గ్రామంలో తయారవుతోంది. దానిని స్విస్ మంత్రి చాలా మెచ్చుకున్నారు. ‘ప్రపంచంలోని ఇతర దేశాల విస్కీల కన్నా చాలా రుచికరంగా ఇది ఉంటుంది’ ఆయన తనకు తెలిపారని పియూష్ గోయెల్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News