Saturday, February 8, 2025

బాలికపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన సంఘటనలో ఐదుగురు నిందితులను నార్సింగి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాలికపై జరిగిన అత్యాచారం విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం…నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌షా కోట్‌కు చెందిన బాలిక ఇంటర్ చదువుతోంది. తనతో చదువుతున్న అదే బస్తీకి చెందిన బాలుడు స్నేహితుడు కావడంతో సెప్టెంబర్, 2024న అతడితో కలిసి బయటికి వెళ్లింది. అక్కడికి వచ్చిన అదే బస్తీకి చెందిన ఇంటర్ చదువుతున్న నలుగురు బాలురు, బాలిక స్నేహితుడు కలిసి బాలికపై అత్యాచారం చేశారు.

ఇంటికి వచ్చిన తర్వాత బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు పరారయ్యారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులను నార్సింగి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News