Saturday, February 8, 2025

ఆస్ట్రేలియా 330

- Advertisement -
- Advertisement -

శ్రీలంకతో జరుగుతున్న రెండో, చివరి టెస్టులో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది.శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ లో 257 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ చండీమల్ (74), వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 85 (నాటౌట్) జట్టుకు అండగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిఛెల్ స్టార్క్, కునెమన్, లియాన్ మూడేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియా శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (21), వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్ (4) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు. మరోవైపు ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 36 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

దీంతో ఆస్ట్రేలియా 91 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను మెరుగు పరిచే బాధ్యతను కెప్టెన్ స్టీవ్ స్మిత్, వికెట్ కీపర్ అలెక్స్ కారే తమపై వేసుకున్నారు. ఇద్దరు లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు లంక బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్మిత్ రక్షణాత్మకంగా బ్యాటింగ్ చేశాడు. కారే దూకుడును ప్రదర్శించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 120 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఇక ధాటిగా ఆడిన కారే 156 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 139 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఇప్పటికే 73 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News