అమెరికాలోఉద్యోగాలు చేయబోయే వాళ్లకు మంజూరు చేసే హెచ్1బి వీసాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ఈ ఏడాది మార్చి 7న ప్రారంభం కానుంది. మార్చి 7 నుంచి 24 వరకు ఇది కొనసాగుతుందని అమెరికా పౌరసత్వ , వలస సేవల సంస్థ (యుఎస్‌సీఐఎస్) ప్రకటించింది. ఈ సమయంలో పిటిషనర్లు , రెప్రజెంటేటివ్‌లు, రిజిస్ట్రేషన్ కోసం యుఎస్‌సిఐస్ ఆన్‌లైన్ అకౌంట్‌ను వినియోగించుకోవాలని సూచించింది. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రతిలబ్ధిదారుడు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని పేర్కొంది. 215 అమెరికా డాలర్లుగా రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ణయించారు. ఆర్థిక సంవత్సరం 2026 హెచ్1బికి సంబంధించి ఆర్థిక సంవత్సరం 2025లో ఎంపిక ప్రక్రియ జరుగుతుందని,
అమెరికా ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1న ప్రారంభమవుతుందని వెల్లడించింది. హెచ్1 బి వీసా లబ్ధిదారుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. వృత్తుల్లో అత్యంత నైపుణ్యం సంపాదించిన భారతీయులే అధిక సంఖ్యలో హెచ్ 1 బీ వీసాలకు ప్రయత్నిస్తుంటారు. ఏటా 65,000 మంది ఈ వీసా కోసం వృత్తి నిపుణులు వీసాలు పొందగా, మరో 20,000 మంది అమెరికాలో ఉన్నత విద్యను పొందుతున్నారు. అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోడానికి ఈ హెచ్1 బి వీసా లబ్ధిదారులనే ఎంపిక చేస్తుంటారు.