- Advertisement -
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై కేసు ఎందుకు కేసు నమోదు చేయలేదని పోలీసులకు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీ సభలో రెడ్లపై తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో రెడ్డి సంఘాల నాయకులు, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మలన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో అతనిపై కేసు నమోదు చేయాలని కోరుతూ హైకోర్టులో అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. రెడ్డి కులస్థులపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు.. మల్లన్నపై కేసు ఎందుకు నమోదు చేయలేదో వివరణ ఇవ్వాలని సిద్దిపేట పోలీసులకు నోటీసులు జారీ చేసింది. పోలీసుల వైఖరి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
- Advertisement -