- Advertisement -
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ.. ఆప్ కు షాకిస్తూ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో బిజెపి మ్యాజిక్ ఫిగర్ 36 దాటింది. ప్రస్తుతం ఆ పార్టీ 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇక, అధికార పార్టీ ఆప్ మాత్రం..28 సీట్లలో ముందంజలో ఉంది. న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆప్ చీఫ్ కేజ్రీవాల్ 343 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. కాల్‌కాజీ నుంచి బరిలో నిలిచిన ఢిల్లీ సీఎం ఆతిషీ 1342 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఆమెపై బిజెపి అభ్యర్థి రమేశ్ బిధూరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం దారుణ ఓటమి దిశగా కొనసాగుతోంది.
- Advertisement -