- Advertisement -
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కెటిఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికల ఓట్ల లెక్కింపులో బిజెపి ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇప్పటికే కమలం పార్టీ.. మ్యాజిక్ ఫిగర్ 36 దాటింది. ప్రస్తుతం 46 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆప్ 24 స్థానాల్లో ముందజలో ఉంది.
ఇక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దారుణ దెబ్బ తగిలింది. ఒక స్థానంలో కూడా ఆధిక్యం సాధించలేకపోయింది. ఈక్రమంలో కెటిఆర్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ.. మరోసారి బిజెపిని గెలిపించారని ఎద్దేవా చేశారు.
- Advertisement -