Saturday, February 8, 2025

బాబుతోనే ప్రజల జీవితాలు మారాయి: సుమన్ బేరి

- Advertisement -
- Advertisement -

అమరావతి: సంస్కరణల ద్వారా ప్రజలకు మేలు చేసిన లీడర్ సిఎం చంద్రబాబు నాయుడు అంటూ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుతో తనకు ఉన్న అనుబంధాన్ని సుమన్ గుర్తు చేశారు. గవర్నర్ రంగరాజన్ తో చంద్రబాబును కలిసిన అంశాలను సుమన్ ప్రస్తావించారు. సిఎం చంద్రబాబు, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి మధ్య ఆసక్తికర సమావేశం జరిగింది.

వాజ్ పేయీ తెచ్చిన విధానాలు ప్రజల జీవితాలను మార్చాయని సుమన్ బేరి చెప్పారు. చంద్రబాబు తెచ్చిన సంస్కరణలను దేశం పాటించిందని, దీంతో పాటు ఐటీ, విమానాశ్రయాలపై, ప్రైవేట్ విద్యుత్, పిపిపి పద్ధతిలో రోడ్లపై ఆవిష్కరణలకు నాంది పలికారని కొనియాడారు. సంస్కరణల ఫలితాలు ఉమ్మడి ఎపిలో కనిపించాయని తెలియ జేశారు. కీలక సమయాన్ని దేశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు భారత్ వేగంగా అడుగులు వేయాలని కోరారు. పిఎం మోదీ హయాంలో దేశం ముందడుగు వేస్తోందని సుమన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News