- Advertisement -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో కమలం పార్టీ 51 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక, ఆప్ 19 సిట్లకే పరిమితమై ఘోర ఓటమి పాలైంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడబోతోందని… ఢిల్లీ ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. 27 ఏళ్లు తరువాత ఢిల్లీలో కాషాయ జెండా ఎగరబోతోందన్నారు.ఇక, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బిజెపి అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.
- Advertisement -