Saturday, February 8, 2025

సిఎం రేసులో పర్వేష్ వర్మ… అమిత్ షాతో భేటీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బిజెపి దూసుకెళ్తోంది. ఇప్పటికే బిజెపి 16 స్థానాలలో గెలుపొందగా 35 సీట్లలో ఆధిక్యంలో ఉండగా ఆప్ ఆరు సీట్ల విజయం సాధించగా 13 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి రేసులో బిజెపి నేత పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు. బిజెపి అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షాతో పర్వేష్ వర్మ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో ఆప్ అధినేత, మాజీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌పై పర్వేష్‌వర్మ గెలుపొందారు.

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు.  బిజెపి నేత పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో కేజ్రీవాల్ ఓటమి చెందారు. న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్లు 3 వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ను ఓడించారు. జైలుకు వెళ్లొచ్చిన ముగ్గురు ఆప్ నేతలు మాజీ సిఎం కేజ్రీవాల్, డిప్యూటీ సిఎం సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ ఓటమి పాలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News