Saturday, February 8, 2025

3 ఛీర్స్ … పెగ్గుతో వర్మ వివాదాస్పద ట్వీట్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మరోసారి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎక్స్ లో వివాదాస్పద ట్వీట్ చేశారు. ఒంగోలు పిఎస్ లో శుక్రవారం విచారణ పూర్తయిన సందర్భంగా ఆర్ జివి ట్వీట్ చేశారు. ఐ లవ్ ఒంగోల్.. ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్ అంటూ పోస్టు చేశారు. 3 ఛీర్స్ అంటూ.. పెగ్గుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేయడంతో వివాదాస్పంగా మారింది. 9 గంటల విచారణ తర్వాత వచ్చి మందు తాగుతున్న ఫోటోలను ఎక్స్ లో షేర్ చేశారు.

ఎపి అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆర్ జివి తన ఎక్స్ తో పోస్ట్ చేయడంపై టిడిపి నాయకులు పలు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వర్మ హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచుకున్నప్పటికి పోలీసు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో వర్మ ఒంగోలు పిఎస్ లో విచారణకు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News