- Advertisement -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర ఓటమి దిశగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం నుంచి ఏ ఒక్క ఫైల్స్ బయటకు వెళ్లొద్దని.. అన్ని ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని ఆదేశించారు. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశ పెడతామని ఇటీవల ప్రధాని మోడీ కూడా తెలిపారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి భారీ విజయం ఖాయమైంది. 70 అసెంబ్లీ స్థానాల్లో 51 స్థానాల్లో కమలం పార్టీ దూసుకుపోతోంది. ఇక, కాంగ్రెస్ పార్టీ మూడోసారి కూడా జీరోకే పరిమితమైంది.
- Advertisement -