Saturday, February 8, 2025

ప్రజల తీర్పుకు శిరసావహిస్తా: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిన సందర్భంగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఆప్ కోసం పోరాడిన నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తున్నానని, గెలిచిన బిజెపి నేతలకు కేజ్రీవాల్ శుభాకాంక్షలు  తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బిజెపి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశానని, విద్య, వైద్యం, మౌలిక వసతుల కోసం ఎంతో పని చేశానని వివరణ ఇచ్చారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 44 స్థానాలలో గెలుపొంది నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 22 స్థానాల్లో గెలుపొంది రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News