Saturday, February 8, 2025

అబద్ధాలు, మోసాలతో కాలయాపన చేస్తున్నారు: అంబటి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలకు అంతులేకుండా పోయిందని వైసిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కూటమి సర్కార్ పై మంత్రి రాంబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అబద్ధాలు, మోసాలతో కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు చేశారు. జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కారు కూతలు కూస్తున్నారని, 9 నెలల్లో చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలి, ఎవరి మెడ పట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు పడుతున్నాయా? ఉద్యోగాలు ఇస్తామని చెప్పి… ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారని బాధను వ్యక్తం చేశారు. పవన్ నిజంగా సిక్ అయ్యాడా?…షూటింగ్ లో ఉన్నాడా? అని అంబటి రాంబాబు కూటమి సర్కార్ ను దుయ్యబట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News