Sunday, February 9, 2025

ఢిల్లీలో రెండు జాతీయ పార్టీలకు నోటా కన్నా తక్కువ ఓట్లు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. రెండు జాతీయ పార్టీలైన బిఎస్పీ, సిపిఐ(ఎం)కు ‘నోటా’(నన్ ఆఫ్ ది ఎబోవ్) ఆప్షన్ కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. ‘నోటా’కు 0.057 శాతం ఓట్లు పోలవ్వగా, బహుజన్ సమాజ్ పార్టీకి 0.55 శాతం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్ట్)కు 0.01 శాతం ఓట్లే పోలయ్యాయి. బిఎస్పీ, సిపిఐ(ఎం) రెండూ జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందినవే. ఢిల్లీలో పోటీ చేసిన ఇతర జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ. ఢిల్లీలో బుధవారం 9451997 ఓటర్లు ఓటును వినియోగించుకున్నారు.

ఓటర్ల టర్నవుట్ 60.54 శాతం. కాగా ఓటర్ల జాబితాలో 1.55 కోట్ల మంది ఉన్నారు. ‘నోటా’ ఆప్షన్‌ను ఎన్నికల్లో 2013లో ప్రవేశపెట్టారు. బ్యాలెట్ పేపర్లో బ్లాక్ క్రాస్ మార్క్‌తో ఉంటుంది ‘నోటా’. 2013 సెప్టెంబర్ సుప్రీంకోర్టు ఉత్తర్వు తర్వాత ఎన్నికల సంఘం ఈవిఎంలో నోటా బటన్‌ను చేర్చింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుకు ముందు ఏ అభ్యర్థికి ఓటేయకూడదనుకుంటే ఫామ్ 490ను పూరించి ఇవ్వాల్సి ఉండేది. ఇదిలావుండగా ఓటర్లు ‘నోటా’ ఆప్షన్‌ను ఎక్కువ వినియోగించుకుంటే మళ్లీ తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఆదేశించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News