Sunday, February 9, 2025

స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్‌లు 42శాతానికి పెందాలి

- Advertisement -
- Advertisement -

సిఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్‌లు 42 శాతానికి పెంచాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఆయన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిసి రిజర్వేషన్‌లు 42 శాతానికి పెంచడానికి సంబంధించి బిల్లు పెట్టకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. కేవలం బిసిల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారని విమర్శించారు. బిసి రిజర్వేషన్లను పెంచుతామని కామారెడ్డి బిసి డిక్లరేషన్‌లో ప్రకటించారని, పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జనాభా ప్రకారం బిసి రిజర్వేషన్‌లు పెంచుతామని ప్రకటించారని గుర్తు చేశారు.

బిసి రిజర్వేషన్లు పెంచడానపికి న్యాయ చట్టపరమైన అవరోధాలు ఏమీ లేవని, జనాభా లెక్కలు ఉన్నాయని, జనాభా లెక్కల్లో కొంత వివాదాస్పదం ఉన్నా 42 శాతం పెంచడానికి అభ్యంతరం ఏముందని ఆయన ప్రశ్నించారు . ముఖ్యమంత్రి రిజర్వేషన్లు పెంచకుండా కులాల లెక్కలు తప్పుగా చూపిస్తూ ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని బిసి రిజర్వేషన్‌లు 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేస్తే ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఏర్పడితే పోరాటం చేస్తామని ఏమీ చేయకుండా తప్పించుకోవడం సరైన పద్ధతి కాదని కృష్ణయ్య తన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బిసి డిక్లరేషన్ ప్రకారం బిసి రిజర్వేషన్‌లను 42 శాతానికి కు పెంచుతామని చెప్పి బిసిలకు ఆశలు కల్పించి ఇప్పుడు ఏ ప్రతిపాదికన తప్పించుకుంటున్నారని ప్రశ్నించారు.

పైగా కులాల లెక్కలు తేల్చి గందరగోళం సృష్టించి ప్రజల దృష్టిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కులాల లెక్కలు పక్కకు పెట్టి 42 శాతానికి రిజర్వేషన్‌లు పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50శాతం సిలింగ్ అని చెప్పి పెంచకుండా తప్పించుకోవడానికి వీలులేదని, ఇప్పటికి అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి 50 శాతం సీలింగ్ పై పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసిందని, అగ్ర కులాలకు రిజర్వేషన్లు పెంచడానికి మూడు రోజులలో లోక్ సభ, రాజ్యసభలో రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రనితి సంతకం చేశారు. కాని 50 శాతానికి పైగా జనాభా గల బిసిల కోసం రాజ్యాంగ సవరణ చేయరా! అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News