సామాజిక, బిసి, ప్రజాసంఘాల జెఎసి
మన తెలంగాణ / హైదరాబాద్ : కులగణన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీల జనాభాను తగ్గించి, కేవలం ఓసి కులాల జనాభాను అధికంగా చూపించడం జరిగిందని దీనిని బట్టి కులగణన బూటకమని సామాజిక, బిసి, ప్రజా సంఘాల జెఎసి విమర్శించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సామాజిక న్యాయం సాధ్యం కాదని పేర్కొంది. సామాజిక న్యాయం కూడా ఇది నాటకమేనని జెఎసి నేతలు పి.నాగరాజు (కులనిర్మూలన వేదిక), డా. పర్వతం వెంకటేశ్వర్ (బిసి ఇంటలెక్చువల్ ఫోరం), మాలి కరుణాకర్ ( బిసి పోలిటికల్ జెఎసి), కెడల ప్రసాద్ (న్యాయవేదిక), కోట్ల వాసుదేవ్ (బిసి రిజర్వేషన్ పోరాట సమితి) పేర్కొన్నారు. కులగణనలో ఆయా వర్గాల జనాభా తగ్గించి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఓసి జనాభాను మాత్రం పెంచి చూయించిందన్నారు. దీంతో సామాజిక న్యాయ నినాదం ఒక నాటకంగా మార్చిందని విమర్శించారు. కోట్లాది ప్రజాధనంను వెచ్చింది నిర్వహించిన సర్వే రిపోర్ట్ తప్పుల తడకగా ఉందన్నారు. కుల గణనపై అనేక అనుమానాలు ఉన్నాయని రీ సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి బిసి ప్రజా ప్రతినిధులను, ఆధిపత్య కులాల పెత్తందారులు, రాజకీయ ఆధిపత్య శక్తులు సామాజికంగా, మానసికంగా బెదిరింపులకు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కుల గణనపై అనుమానాలున్నాయి… రీసర్వే చేయించాలి
- Advertisement -
- Advertisement -
- Advertisement -