Monday, February 10, 2025

కూలిన ‘కేజ్రీ’వాల్

- Advertisement -
- Advertisement -

ఆప్‌ను ఊడ్చేసిన కమలం

ఆప్ అధినేత కేజ్రీవాల్ హ్యాట్రిక్ ఆశలు గల్లంతు 48 సీట్లతో అధికారంలోకి బిజెపి
22 స్థానాలతో సరిపెట్టుకున్న ఆప్ ఉనికి చాటుకోని కాంగ్రెస్…వరుసగా మూడోసారి
సున్నాకే పరిమితం కేజ్రీవాల్, సిసోడియా సహా ఆప్ మహామహుల ఓటమి
బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కిన సిఎం ఆతిశీ సిఎం రేసులో ముందున్న పర్వేశ్‌వర్మ
అవినీతి ఆరోపణలు, తాగునీటి కొరత, యమున వివాదం, శీశ్‌మహల్ అంశాలే ఆప్
ఓటమిలో కీలక పాత్ర ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తా ఓడినా ప్రజల్లోనే ఉంటా :
కేజ్రీవాల్ స్పష్టీకరణ 27 ఏళ్ల తరువాత హస్త్తినలో అధికారం అందుకుంటున్న బిజెపి

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం విజయదుందుభి మో గించింది. హ్యాట్రిక్ విజయం సాధించి మరోసారి గద్దెనెక్కాలని గం పెడాశలు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి భారతీయ జనతా పార్టీ ఈసారి గండికొట్టింది. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తి న పీఠంపై బిజెపి పాగా వేసింది. దీంతో దేశవ్యాప్తంగా బిజెపి శ్రేణు లు టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సంబురాల్లో మునిగిపోయాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 48 స్థానాలను కాషాయ పార్టీ కైవసం చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. 22 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇ క కాంగ్రెస్ సున్నా సీట్లకే పరిమితమైంది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢి ల్లీ మాజీ సిఎం కేజ్రీవాల్ ఓటమి పాలు కావడం ఆ పార్టీకి అతి పెద్ద దెబ్బ. న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలో దిగిన ఆయనపై బిజెపికి చెందిన పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ 4,089 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఈయన మాజీ సిఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. ఇక మరో కీలక నాయకుడు, ఢిల్లీలో విద్యారంగాన్ని గాడిన పెట్టిన వాడిగా పేరున్న మాజీ మంత్రి మనీష్ సిసోడియాను సైతం ఓటర్లు ఓటమిబాట పట్టించారు. 675 ఓట్ల తేడాతో బిజెపికి చెందిన తర్వీందర్ సింగ్ చేతిలో ఆయన ఓడిపోయారు. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు కీలక నేతలు సోమ్‌నాథ్ భారతి, సౌరభ్ భరద్వాజ్ సైతం పరాజయం పాలయ్యారు. ముగ్గురు మంత్రులు ఆప్ పరువు కాపాడారు. గోపాల్ రాయ్(బాబర్‌పూర్), ముఖేష్ అహ్లావత్(సుల్తాన్‌పూర్ మజ్రా), ఇమ్రాన్ హుస్సేన్(బల్లిమరాన్) విజయం సాధించారు. ఇక ప్రస్తుత సిఎం ఆతిశీతో విజయం ఆఖరి క్షణం వరకు దోబూచులాడింది. కల్కాజీ స్థానం నుంచి బరిలో దిగిన ఆమె బిజెపి కీలక నేత రమేష్ బిదూరీని ఓడించి తిరిగి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. బిజెపికి చెందిన రేఖా గుప్తా షాలిమార్ భాగ్ నుంచి ఆప్‌కు చెందిన మణీందర్ సింగ్‌పై 29వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

కాగా, 15 ఏళ్ల పాటు షీలాదీక్షిత్ నాయకత్వంలో ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీకి ఇది వరుసగా మూడో ఓటమి కావడం విశేషం. ఢిల్లీలో ఈ సారి ఆ పార్టీ ఉనికి లేకుండా పోవడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయాయి. ఇక మొదటి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత ఉత్కంఠగా సాగింది. అత్యధిక స్థానాల్లో అభ్యర్థుల నడుమ పోరు నువ్వా నేనా అన్నరీతిలో సాగింది. కొన్ని స్థానాల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థులకు నడుమ ఓట్ల తేడా వందల సంఖ్యలోనే ఉండటం గమనార్హం. మూడు సార్లు సిఎంగా చేసిన దివంగత షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కేవంల 4వేల ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు. మరోవైపు ఢిల్లీలో విజయంపై ప్రధాని మోడీ ‘ఎక్స్’లో స్పందించారు. అభివృద్ధి, సుపరిపాలన నినాదాలకు ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని అన్నారు.

సిఎం పీఠం ఎవరిని వరించేనో..?

కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేజ్ వర్మ వెంటనే హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇప్పుడు సంబరాలకు ఇది మంచి సమయం, ముఖ్యమంత్రి ఎవరన్నది కాదన్నారు. సిఎం రేసులో ఈయన ముందున్నట్లు ప్రచారం సాగుతోంది. అదే సమయంలో మహిళా సిఎం ప్రతిపాదన వస్తే దివంగత నాయకురాలు సుష్మాస్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్, మాజీ ఎంపి స్మృతి ఇరానీ పేర్లు తెరపైకి వస్తున్నాయి. బిజెపి ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేశ్, పార్టీ జాతీయ కార్యదర్శి దుశ్యంత్ గౌతమ్, ఎంపి మనోజ్ తివారీ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే బిజెపి అగ్రనాయకత్వం సమావేశమై సిఎం ఎవరన్నది తుది నిర్ణయం తీసుకుంటుంది.

ఆప్‌ను ఓడించిన అంశాలు..

ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, సిసోడియా తదితరులు అవినీతి కేసుల్లో జైలు పాలు కావడం, ప్రజలకు తాగునీటి కొరత, యమునా నీళ్ల వివాదం, అధ్వాన్నంగా మారిన పారిశుధ్య పరిస్థితులను బిజెపి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఆప్‌దా, శీశ్ మహల్ ప్రచారాన్ని కూడా ప్రధాని మోడీ సహా మంత్రులు, ఇతర నేతలు ఓటర్ల మనస్సుల్లోకి చొప్పించగలిగారు. ఇక లెఫ్టినెంట్ గవర్నర్‌తో పాలనాపరమైన వివాదాలు కూడా ప్రజలను విసిగివేసారేలా చేశాయి. ఇవన్నీ ఆప్ ఓటమికి ప్రధాన కారణాలు నిలిచాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఎవరికి ఎంత శాతం ఓట్లు

ఇండియా కూటమిలో ఉన్న ఆప్, కాంగ్రెస్ పార్టీల నడుమ ఢిల్లీ ఎన్నికల్లో ఏర్పడ్డ వైరుధ్యం ఓటమికి దారి తీసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటు షేర్‌ను పరిశీలిస్తే అది అవగతమవుతోంది. తాజా ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బిజెపికి 45 శాతం ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీకి 43 శాతం ఓట్లు దక్కాయి. అంటే కేవలం 2శాతం ఓట్ల తేడాతో ఆప్ అధికారానికి దూరమైంది. అయితే మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 6 శాతం ఓట్లు దక్కించుకుంది. ఈ రెండు పార్టీలు ఒక్కతాటిపై నిలిచి సీట్ల పంపిణీలో ఏకాభిప్రాయానికి వస్తే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. అయితే ఓటు బదిలీ సక్రమంగా జరిగితేనే అది జరిగేదని మరో వాదన.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News