Sunday, February 9, 2025

జైలు పక్షులు ఓటమిపాలు

- Advertisement -
- Advertisement -

కేజ్రీవాల్‌ను చిత్తుచేసిన పర్వేశ్‌వర్మ, 4088 ఓట్ల మెజారిటీ, మనీష్ సిసోడియాపై గెలిచిన తార్విందర్, సిఎం రేసులో పర్వేశ్

న్యూఢిల్లీ : హోరాహోరీగా సాగిన ఢిల్లీ శాసనస భ ఎన్నికల్లో బిజెపి నేతలు పర్వేష్ వర్మ, తార్విందర్ సింగ్ మార్వాహ్ ఘనాపాఠీలపై విజయం సాధించిన విశిష్ట ఘనత సాధించారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత, మాజీ ముఖ్యమం త్రి అర్వింద్ కేజ్రీవాల్‌ను పర్వేష్ వర్మ చి త్తు చేయగా, జంగ్‌పురాలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సి సోడియాను తార్విందర్ మా ర్వాహ్ ఓడించారు. న్యూఢిల్లీ సీ టుకు హోరాహోరీగా సాగిన ముక్కోణపు పోటీలో వర్మ 30088 వోట్లు సాధించగా, కేజ్రీవాల్ 25999 వోట్లతో రెండవ స్థా నంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ 4568 వోట్లతో మూడవ స్థానం పొందారు. పశ్చి మ ఢిల్లీ నుంచి రెండు సార్లు ఎంపి అయిన వర్మ తన అభ్యర్థిత్వాన్ని బిజెపి అధికారికంగా ప్రకటించడానికన్నా చాలా ముందుగానే కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు.

ఆ విధంగా ఆయన మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ప్రధాన పోటీదారుగా నిలిచారు. కేజ్రీవాల్‌పై ఆయన విజయం రాజధానిలో బిజెపికి చెందిన అత్యంత ప్రముఖ జాట్ నేతల్లో ఒకరిగా ఆయన హోదాను పెంచడమే కాకుండా ముఖ్యమంత్రి పదవికి అవకాశం ఉన్న అభ్యర్థిగా ఆయన స్థానాన్ని పటిష్ఠం చేస్తున్నది. మేనేజ్‌మెంట్ పట్టభద్రుడు అయిన వర్మ యువకునిగా ఉన్నప్పటి నుం చి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఆ యన ఆర్‌ఎస్‌ఎస్‌తో ప్రారంభించి బిజెపి శ్రేణుల ద్వారా పైకి ఎదిగారు. ఆయన మొదటిసారి 2013లో మెహ్రౌలి నుంచి ఎంఎల్‌ఎ అ య్యారు. ఆ తరువాత ఆయన 2014, 2019లలో పశ్చిమ ఢిల్లీ నుం చి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. తన తండ్రి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ స్థాపించిన లాభాపేక్ష రహిత సంస్థ రాష్ట్రీయ స్వాభిమాన్ ద్వారా సంఘ సేవలో కూడా వర్మ పాల్గొంటున్నారు. మరొక ప్రధాన తా రుమారు ఫలితంలో బిజెపి నేత మార్వాహ్ జంగ్‌పురా నియోజకవర్గంలో సిసోడియాను 675 వోట్ల స్వల్ప తేడాతో ఓడించారు.

మార్వాహ్‌కు 38859 వోట్లు పోల్ కాగా, సిసోడియాకు 38184 వోట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఫర్హాద్ సూర్కి 7350 వోట్లు లభించాయి. ఆప్‌లో కీలక వ్యూహకర్త, పార్టీ విద్యా సంస్కరణల సూత్రధారి అయిన సిసోడియా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో 2023లో అరెస్టు దరిమిలా జైలులో 17 నెలలు గడిపిన త రువాత ఎన్నికల రాజకీయాలకు తి రిగి వచ్చారు. 2024 ఆగస్టులో బెయిల్‌పై విడుదలైన సిసోడియా విద్య, పాలన ప్ర ధాన అంశాలుగా గ ట్టి ప్రచారం సాగించారు. అయితే, ప త్‌పర్‌గంజ్ నుంచి జంగ్‌పురాకు సిసోడి యా మారడం ఊహాగానాలకు దారి తీసింది. ఆయ న సురక్షిత స్థానం కోరుకుంటున్నారని ప్రత్యర్థులు ఆరోపించారు. ఆ యన 2020 ఎన్నికల్లో పత్‌పర్‌గంజ్‌లో 3207 వోట్ల స్వల్ప తేడాతో గెలిచారు. సిసోడి యా ఎంతగా కృషి చేసినప్పటికీ ఆయన ఓటమి ఆప్‌కు చెప్పుకోదగిన ఎదురుదెబ్బే. ఆయనను పార్టీ తమ పాలన నమూనాకు ఒక మూలస్తంభంగా పే ర్కొన్నది.

ఆప్ అధికారాన్ని నిలబెట్టుకునేటట్లయి తే, సిసోడియాను తిరిగి ఉప ముఖ్యమంత్రిని చేస్తానని ఎన్నికల ముందు కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. సిసోడియా తన ఓటమిని ఒప్పుకుంటూ, ‘మా పా ర్టీ కార్యకర్తలు బాగా పోరాడారు, మేము కష్టించి పని చేశాం. ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు. కానీ నేను 600 వోట్ల తేడాతో ఓడిపోయాను. విజేతను అభినందిస్తున్నాను, ఆయన నియోజకవర్గాని కి బాగా సేవ చేస్తారని ఆశిస్తున్నాను’ అని చెప్పారు. 1959లో ఢిల్లీలో జన్మించిన మార్వాహ్ 2022లో బిజెపిలోకి మారడానికి ముందు జంగ్‌పురా నుంచి (1998 2013) మూడు సా ర్లు కాంగ్రెస్ ఎంఎల్ ఎ. పేరొందిన సిక్కు నేత అయిన మార్వా హ్ బిజెపి ఢిల్లీ సిక్కు వి భాగానికి అధ్యక్షత వహిస్తున్నారు.

ఆయన రాజకీయ జీవి తం వివాదాలమయం. బిజెపిలోకి ఫిరాయించడానికి ముండు కాంగ్రెస్ ఆ యనను పక్కన పెట్టిందనే వాదన కూడా వినిపించింది. రెంటల్ ఆస్తుల ద్వారా ఆదాయం పొందుతుండే వాఱిజ్యవేత్త మార్వాహ్ కాంగ్రెస్ నే త రాహుల్ గాంధీపై నిశిత విమర్శల ద్వారా అం దరి దృష్టినీ ఆకర్షించారు. తన ఆందోళనలను కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోలేదని మార్వాహ్ ఆరోపించారు కూడా. కాగా, కేజ్రీవాల్, సిసోడి యా పరాజయాలతో బిజెపి ఢిల్లీలో అఖండ విజ యం సాధించింది. 70 అసెంబ్లీ సీట్లలోకి బిజెపి 48 సీట్లు గెలుచుకున్నది. ఆప్‌కు 22 సీట్లు మాత్ర మే దక్కాయి. ఈ ఫలితాలు రాజధాని రాజకీయ రంగంలో గణనీయమైన మార్పును సూచిస్తోంది.

ఈ ఫలితాలు ‘ఆప్’కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ను అంగీకరిస్తున్నామని ఆప్ నాయకురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి శనివారం తెలిపారు. ఇది తమ పార్టీకి ఓ ఎదురుదెబ్బ అని, అయితే బిజెపి కి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతూనే ఉం టుందని అన్నారు. ఢిల్లీలో బిజెపి 26 ఏళ్లకు మించి తిరిగి అధికారంలోకి వచ్చిందన్నది ఇక్క డ గమనార్హం. ‘ఢిల్లీ ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు దృఢంగానే నిలిచారు. అయితే మేము ప్రజా తీర్పును ఆమోదిస్తున్నాం. బిజెపి నిరంకుశత్వం, గూండాగిరిపై మా పోరాటం కొనసాగుతుంది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి ఓ ఎదురుదెబ్బ. ఢిల్లీలో ప్రజల కోసం, దేశం కోసం ఆప్ పోరాడుతూనే ఉంటుంది’ అని ఆతిషి అన్నారు. కల్కాజీ సీటు ఫలితాన్ని ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించా ల్సి ఉందని, అక్కడ బిజెపి అభ్యర్థి రమేశ్ విధురి, కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా తలపడుతున్నారని తెలిపారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ ఎల్లప్పుడూ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతుంది, ఈసారి ఎదురుదెబ్బ తగిలింది, అయినా ఆప్ పోరాడుతూనే ఉంటుంది’ అని తెలిపారు.

ప్రజా తీర్పును శిరసావహిస్తాం

AAP defeat in Delhli Assembly elections

బిజెపికి అభినందలు, ఓటర్లకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఆశిస్తున్నా:
ఆప్ అధినేత కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిని ఆప్ జా తీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒప్పుకున్నారు. ఫలితాల సరళి బిజెపికి అనుకూలంగా మారిన నేపథ్యంలో ఆ యన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల ఆదేశాన్ని శిరసావహిస్తున్నట్లు తెలిపారు. ఓటరు తీ ర్పును పూర్తి వినయ విధేయతలతో అంగీకరిస్తున్నామన్నారు. ఘన విజయం సాధించిన భారతీ య జనతా పార్టీకి అభినందనలు తెలిపారు. బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజలకు ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల్లో ఢిల్లీ ప్రజల కో సం ఎంతో చే శామన్నారు. ఆ రో గ్యం, విద్య, వైద్య ం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆప్ ఎనలేని కృషిసల్పినట్లు కే జీవాల్ వివరించారు. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ తీర్పును గౌరవం గా భావిస్తానని అన్నారు. ఇక ప్రతిపక్షంగా ని ర్మాణాత్మక పాత్రను పోషిస్తామన్నారు. అలాగే ప్రజల మధ్యే ఉంటూ వారికి సేవ చే స్తూ వారి వె న్నంటే ఉంటాని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. అ లాగే ఎన్నికల్లో పోరాడిన ప్రతి ఒక్క ఆప్ పార్టీ నేతకు, కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

మద్యమే ముంచింది

ఆప్ ఓటమిపై అన్నా హజారే వ్యాఖ్య
ముంబయి : భారతీయ జనతా పార్టీ (బిజెపి) 26 సంవత్సరాలకుపైగా తరువాత ఢిల్లీలో అధికార పీఠం అధిష్ఠిస్తుండడంతో అర్వింద్ కేజ్రీవాల్ కు ఒకప్పుడు గురువు అయిన సంఘ సేవకుడు అన్నా హజారె ఆప్ పరాజయానికి స్పందిస్తూ మ ద్యం విధానం, డబ్బుపై దృష్టి కేంద్రీకరించడం కారణంగా ఆప్ ‘మునిగిపోయింది’ అని విమర్శించారు. కేజ్రీవాల్‌పై అవినీతి వ్యతిరేక కార్యక ర్త హజారె వ్యంగ్యోక్తులు విసురుతూ, అభ్యర్థి ని ష్కళంకుడుగా ఉండాలని, అతను త్యాగం విలువ తెలుసుకోవాలని అన్నారు. అన్నా హజారె అవినీ తి వ్యతిరేక ఉ ద్యమం నుంచి ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ 70 మంది స భ్యుల ఢిల్లీ శా సనసభకు ఎన్నికల్లో బిజెపి చేతి లో ఓడిపోయింది. 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి సార థ్యం వహించి న అన్నా హ జా రె రాలెగావ్ సిద్ధి గ్రామంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ, ‘మద్యం విధానంతో డబ్బు వచ్చింది. వారు దానిలో నిండా మునిగారు. (ఆప్) ప్రతిష్ఠ మసకబారింది. ఆయన (అర్వింద్ కేజ్రీవాల్) నిష్కళంక లక్షణం గురించి, అటుపిమ్మట మద్యం గురించి మాట్లాడడాన్ని జనం చూశారు’ అని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News