- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండో ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ లోని మలక్ పేట మార్కెట్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి యాక్టివా వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ప్రమాదంలో చంచల్ గూడకు చెందిన షేక్ ఇస్మాయిల్ దుర్మరణం చెందారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్ పాడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని బాలుడు చనిపోయాడు. ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న అనిల్(14) మరణించాడు. రెండు ఘటనాలలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -