- Advertisement -
కటక్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా 26 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. రోహిత్ 80 బంతుల్లో 110 పరుగులు చేశాడు. శుబ్‌మన్ గిల్ 60 పరుగులు చేసి జమీ ఓవర్టన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఓపెనర్లు రోహిత్-గిల్ 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విరాట్ కోహ్లీ ఐదు పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(110), శ్రేయస్ అయ్యర్(13) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
- Advertisement -