Tuesday, February 11, 2025

ఎసిబి వలలో పంచాయతీరాజ్ ఏఈ

- Advertisement -
- Advertisement -

వరంగల్ జిల్లా, సంగెం మండలం, కుంటపల్లి గ్రామానికి చెందిన సవిత అనే మహిళ ఇంటి నిర్మాణం కోసం అనుమతి కోరగా పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న రమేష్ అందుకు రూ.80 వేలు డిమాండ్ చేశాడు. అయితే, డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని బాధితురాలి భర్త ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు హనుమకొండ సుబేదారిలో ప్రయివేట్ ఆఫీస్‌లో రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీరాజ్ ఏఈ రమేష్,

అతని అసిస్టెంట్ సారయ్యను ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదిలావుండగా, మూడు రోజుల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లా డిటిసి శ్రీనివాస్ అవినీతి పాల్పడి కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టారనే అభియోగం మేరకు ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఈ సంఘటన మరువక ముందే మరో అవినీతి తిమింగలం పంచాయతీరాజ్ ఏఈ ఎసిబి అధికారులకు పట్టుబడడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News