Friday, March 14, 2025

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

విద్యాదాఘాతంతో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంఘటన పాతబస్తీలోని దివాన్ దేవిడిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పది ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పివేయగా, రూ.50కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. స్థానికులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని దివాన్ దేవిడిలోని అబ్బాస్, మదినా టవర్లో దాదాపు 400 వరకు రెడీమెడీ వస్త్ర వ్యాపారాలు నిర్వహించే హోల్ సేల్ దుకాణాలు ఉన్నాయి. రోజు మాదిరిగానే వ్యాపారులు ఆదివారం రాత్రి వ్యాపారాలను ముగించుకొని షాపులను మూసివేసి ఇళ్లకు వెళ్లిపోయారు. సోమవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో 4వ అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలను ్న గమనించిన వాచ్‌మెన్ వెంటనే మొఘల్‌పుర అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.

వస్త్రాలు కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. అగ్నికీలలు ఎగిసిపడడంతో మంటలు భారీగా అంటుకున్నాయి. మంటలు ఎక్కువ కావడంతో జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న ఆదేశాలతో హైకోర్ట్, యాకత్‌పుర, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మలక్‌పేట, సాలర్ జంగ్ మ్యూజియం, రాజేంద్రనగర్ ఏరియాల నుంచి ఫైరింజన్లను రప్పించారు. దాదాపుగా 60 మంది అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. నాలుగో ఫ్లోర్లో చెలరేగిన మంటలు కొద్ది సేపట్లోనే సెల్లార్లోని 2 గ్రౌండ్ ఫ్లోర్ వరకు వ్యాపించాయి. అబ్బసి మదీనా టవర్‌లో చిన్న చిన్న గదులు ఉండడంతో మంటలు అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ఈ సముదాయంలో 400 వరకు దుకాణాలు కొనసాగుతున్నాయని, ఎక్కడా ఫైర్ సేఫ్టీ లేదని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా, అగ్నిప్రమాదం సంభవించిన కాంప్లెక్స్‌లోని పై అంతస్తులో వాచ్‌మెన్ కుటుంబం ఉంటున్నారు.

ఈ విషయం తెలియడంతో అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడి పై అంతస్తు నుంచి కిందికి తీసుకుని వచ్చారు. విద్యుదాఘాతమే అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని చార్మినార్ ఎమ్మెల్యే మిర్ జుల్ఫీకర్ అలీ, ఫైర్ డిజి జీవీ నారాయణ, అదనపు డీజీ ప్రసన్న కుమార్, డీసీపీ స్నేహా, ఏసీపీ చంద్రశేఖర్, రీజినల్ ఫైర్ అధికారి హరినాథ్ రెడ్డి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ అధికారులు ప్రభాకర్ రెడ్డి, షణ్ముఖ రావు, రఫీ సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News