వినియోగదారులకు తక్కువ ధరకే
ఇసుక అందుబాటులో ఉండాలి ఇసుక
మాఫియాపై ఉక్కుపాదం మోపాలి
అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక
అధికారులను నియమించాలి
హైదరాబాద్‌లో ఇసుక అక్రమాల
నియంత్రణ బాధ్యత హైడ్రాకు ఇసుక
స్టాక్‌యార్డుల వద్ద కట్టుదిట్టమైన కంచె
సమీక్షా సమావేశంలో అధికారులకు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల కు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధ రకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇసుక అక్రమరవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని సిఎం హెచ్చరించారు. ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని సిఎం స్పష్టం చేశారు. అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని ఆయన తెలిపారు. పారదర్శకంగా, అక్రమాలకు తావులేకుండా పర్మినెంట్ ఉద్యోగులకు బా ధ్యతలు అప్పగించాలని సిఎం సూచించారు. మై నింగ్, టిజిఎండిసి అధికారులతో సిఎం రేవంత్‌రెడ్డి సోమవారం సమీక్ష జరిపారు.ఈసందర్భం గా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ బి ల్లులను వెంటనే చెల్లించాలని సిఎం అధికారుల ను ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ ను అరికట్టి పే దలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఆయన అ ధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్‌ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆయన ఆదేశించా రు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించ వద్దన్నారు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు ఈ బాధ్యతలు అప్పగించాలని సిఎం రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత హైడ్రాకు అప్పగించాలన్నా రు. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నిఘా ఏర్పాటు చేయాలని ముఖ్యమం త్రి సూచించారు. ప్రతి ఇసుక రీచ్‌ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ దీపాలను ఏ ర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్‌తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్‌లు ఏర్పాటు చేయాలని సిఎం సూ చించారు. రవాణాకు రైతులకు టకీ … టకీమని పైసలు పడతాయని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ ఎవరికీ రాలేదన్నారు. లగచర్ల గ్రామ భూములను అల్లుడు ఫార్మా కంపెనీ కోసం గుంజుకోవాలని చూస్తున్నారని అన్నారు. 14 నెలలుగా ఎన్నో అరాచకాలు చేస్తున్నారని, కొడంగల్ రైతుల కోసం తాను సంవత్సమైనా జైల్లో ఉంటానని, తమ ప్రాంత రైతులను జైల్లో పెట్టారని, వాళ్లను విడిపించాలని మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్ రెడ్డి తనతో చెప్పారని అన్నారు.
9 నెలలు గర్భవతిగా ఉన్న జ్యోతి తమతో పాటు ఢిల్లీకి వచ్చిందన్నారు. అక్కడికి వచ్చి రైతులంతా హ్యూమన్‌రైట్స్ ముందు తమ బాధను వినిపించుకున్నారని అన్నారు. తాను వస్తుంటే టెంట్ కింద ఆనాడు గర్భిణిగా ఉన్న జ్యోతి బిడ్డకు జన్మనిచ్చిందని, తన బిడ్డకు పేరు పెట్టు అనడంతో వాళ్ల ఇంటి పేరుతో కలిపి ‘భూమి’ అనే పేరు పెట్టానని అన్నారు. భూ పోరాటంలో బిడ్డకు పేరు పెట్టడం తనకు చాలా సంతోషంగా అనిపించిందన్నారు. తొందర్లోనే రేవంత్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి అచ్చంపేటకు పంపుతామన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని సవాల్ చేశారు. తాము ఎవరం కూడా ప్రచారానికి రామని, పట్నం నరేందర్ రెడ్డికి 50 వేల ఓట్ల మెజార్టీ తగ్గితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానిని అన్నారు. ఇక్కడికి వస్తుంటే నాయీబ్రాహ్మణ, రజక సోదరులు వచ్చి తనను కలిసి మొరపెట్టుకున్నారని అన్నారు.
కేసిఆర్ ఉన్నపుడు తమకు ఉచిత కరెంటు ఇస్తుండేనని, ఇప్పుడు మళ్లీ బిల్లులు ఇస్తున్నారని తెలిపారని అన్నారు. ‘రేవంత్ రెడ్డి ..నీకు చిత్తశుద్ధ్ది ఉంటే కల్వకుర్తిలోని భూములలో ఫార్మా కంపెనీ పెట్టు’ అని సవాల్ చేశారు. ‘అల్లుడి కోసం…అదానీ కోసం భూములు తీసుకుంటాం అంటే నీ అయ్య జాగీరు కాదు రేవంత్ రెడ్డి..బరాబర్ అడుగుతాం..కడుగుతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, లకా్ష్మరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, హుజూరాబాద్ ఎంఎల్‌ఎ పాడి కౌశిత్ రెడ్డి, ఎంఎల్‌సి నవీన్ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు రాజేందర్ రెడ్డి, రాంమోహన్ రెడి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహేష్ రెడ్డి, ఆనంద్, ఆంజయ్య, ప్రవీణ్ కుమార్, ఆంజనేయులు, రామకృష్ణ, సలీం, వెంకట్ నర్సిములతో పాటు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.