Tuesday, February 11, 2025

గ్వాటెమాలాలో లోయలో పడిన బస్సు..51 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో బస్సు లోయలో పడి 51 మంది మృతి చెందారు. సెయింట్ అగస్టిన్ నుంచి గ్వాటెమాలా సిటీకి బయలుదేరిన బస్సు తెల్లవారు జామున ఓ వంతెన మీద నుంచి లోయలో పడిపోయినట్టు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దాదాపు 35 మీటర్ల ఎత్తు నుంచి వాహనం పడినట్టు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 75 మంది ఉన్నట్టు సమాచారం.

గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వాహనం కింద బురదగా ఉండటం, అందులో ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.ఈ విషాద సంఘటనపై విచారం వ్యక్తం చేసిన అధ్యక్షుడు బెర్నార్డో అరెవాలో… మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని సైన్యంతోపాటు విపత్తు నిర్వహణ విభాగాలను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News