Tuesday, February 11, 2025

బస్సు కోసం కూర్చున్న ఇద్దరు యువతులపైకి దూసుకొచ్చిన రెడీమిక్స్ లారీ

- Advertisement -
- Advertisement -

బస్సుకోసం వేచి చూ స్తున్న యువతుల పైకి రెడీమిక్స్ లారీ దూసుకురాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం… తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అ ంతాయి పల్లి కి చెందిన గాయత్రి, భవాణిలు నగరంలో కాల్ సెంటర్‌లో పని చేస్తున్నారు. రోజు మాదిరి లాగానే సోమవారం ఉదయం బస్సుకోసం బిట్స్ చౌరస్తా లో వెదురు వనం వద్ద వేచి ఉన్నారు. అదే సమయంలో అంతాయి పల్లి నుండి తుంకుంట వైపు వస్తున్న రెడీమిక్స్ లారీ ఎదురుగా వస్తున్న కారును త ప్పించ బోయి రోడ్డు పక్కన కూర్చున్న యువత్తుల మీదకు దూసుకొచ్చింది. దీంతో తీవ్ర గాయలపలైన వారిని నగరంలోని శ్రీకర అస్పత్రి కి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న అంతాయి పల్లి గ్రామ ప్రజలు ఒక్కసారిగా సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డు పై బైటాయించి ఆందోళన చేపట్టారు. ఈ చౌరస్తాలో ఎ న్నో ప్రమాదాలు జరుగుతున్న నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి భీష్మించా రు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనాథ్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులను సముదాయించారు. నివారణకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం రో డ్డు ప్రమాదల నివారణకు చర్యలు తీసుకోవడం తో పాటు భాధితులకు న్యాయం చేయాలని కలెక్టరెట్ కార్యాలయం వద్ద గ్రామస్తులు నిరసన వ్యక్తం చేసారు. ఈ మేరకు శామీర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News