- Advertisement -
అమరావతి: రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ఉంగుటూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముదునూరుపాడు గ్రామంలో తాడి వెంకటరమణారెడ్డి(60), విమలాదేవి(56) నివసిస్తున్నారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌కు సమీపంలో దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్థానిక పోలీసులకు అప్పగించారు.
- Advertisement -