Tuesday, February 11, 2025

ఐదేళ్ల క్రితం దోపిడీ కేసు… ఫింగర్ ప్రింట్స్ తో పట్టుకున్నారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐదేళ్ల క్రితం జరిగిన దోపిడీ కేసులో ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావడంతో తాజాగా ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్నాలజీ వినియోగంతో పాత నేరస్తుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 2019 డిసెంబర్ లో జూబ్లీహిల్స్ లోని ఓ ఇంట్లోకి గోవింద్ బండారి అనే వ్యక్తి ప్రవేశించి కత్తితో బెదిరించి నగదుతో పాటు ఆభరణాలు దోపిడీ చేశాడు. చోరీ తర్వాత నిందితుడు గోవింద్ బండారి నేపాల్ పారిపోయాడు. ఐదేళ్ల తర్వాత హైదరాబాద్ కు తిరిగివచ్చిన సెల్ ఫోన్ చోరీలు చేస్తుండగా ఎస్ ఆర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ ఆర్ నగర్ పోలీసులు అతడి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

నిందితుడి వద్ద నుంచి సేకరించిన వేలిముద్రలు ఫింగర్ ప్రింట్ బ్యూరోలో నమోదు చేసి పాత కేసులను పోలీసులు విచారణ చేపట్టారు. 2019 దోపీడీ కేసుకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ను జూబ్లీహిల్స్ పోలీసులు పరిశీలించారు. ఫింగర్ ప్రింట్స్ బ్యూరో లో నిందితుడి వేలిముద్రలు మ్యాచ్ కావడంతో గోవింద్ కోసం వేట ప్రారంభించారు. అప్పటికే నిందితుడు గోవింద్ భండారి బెయిల్ మీద  బయటకు వచ్చాడు. మరోసారి నేపాల్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. 14 కేసుల్లో బండారి నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News