మోత్కూర్: యాదాద్రి భువనగిరి అడ్డగూడూర్ మండల పరిధిలోని గల చౌళ్ల రామారం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం బొడ్డు గూడెం టోల్ గేట్ వద్ద లారీ ఢీకొట్టడంతో మహిళా టీచర్ మృతి చెందింది. జబీనా అనే మహిళ మోత్కూర్ మండలంలోని దాచారం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా సేవలందిస్తున్నారు. స్కూటీపై టీచర్ వెళ్తుండగా లారీ ఢీకొట్టి అనంతరం ఆమె తల పైనుంచి పోవడంతో నుజ్జు నుజ్జుగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు టీచరమ్మ దాచారం స్కూళ్లో పిల్లలందరికీ స్పోర్ట్స్ డ్రెస్ ఇప్పించడంతో పాటు ఆ టైలు బ్యాడ్జీలు ఇప్పించింది. జబీనా మేడమ్ పిల్లలను ఎంతో మంచిగా చూసుకునేవారని దాచారం గ్రామస్థులు స్మరించుకుంటున్నారు. బడి పిల్లలకు మంచిగా విద్యాబద్దులు నేర్పించారని గామస్థులు నెమరువేసుకుంటున్నారు. ఆమె మృతిపట్ల దాచారం గ్రామస్థులు సంతాపం తెలపడంతో ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రోడ్డు నిర్మాణ పనులలో జాప్యం జరుగుతుండడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు.