Tuesday, February 11, 2025

వారికి కులగణనపై మాట్లాడే హక్కు లేదు: పొన్నం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే మార్గదర్శకం నిలిచిందని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పుడో స్పష్టం చేశారని, ఎవరి లెక్క ఏంటో తేలాలన్నారు. కరీంనగర్ లో పొన్నం మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ బిజెపి దొందు దొందే రాంగ్ డైరెక్షన్ లో పోయేలా ఈ రెండు పార్టీలు ప్రవర్తిస్తున్నాయని దుయ్యబట్టారు. బిఆర్ఎస్ బిజెపిలకు కులగణనఫై మాట్లాడే నైతిక అర్హత లేదని, బిజెపి కులగణనను వ్యతిరేకిస్తు అపిడపిట్ ధాఖలు చేసిందని పొన్నం విమర్శలు గుప్పించారు. మొన్నటి సర్వేలో పాల్గొనని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కెటిఆర్, హరీష్ రావు కు ఫామ్ లు పంపుతున్నామన్నారు. తాము ప్రణాళిక సంఘం ఆద్వర్యంలో కులగణన సర్వే చేశామని, వివరాలు ఇప్పుడైనా ఇవ్వాలని, అప్పుడే బిఆర్ఎస్ వాళ్లకు మాట్లాడే అవకాశం ఉంటుందని పొన్నం చురకలంటించారు.

సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత హక్కు లేదని, బిజెపికి చేతనైతే దేశవ్యాప్త సర్వే చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకరావాలని డిమాండ్ చేశారు. నిర్ణయం నుంచి నివేదిక దాకా నివేదిక నుంచి నిధుల దాకా ఎలా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బిసిలకు న్యాయం చేసేలా కృషి చేస్తుందని, మేధావులు, అన్ని కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని, ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని వివరణ ఇచ్చారు. బిసిలలో ముస్లీం మైనారిటీ అనేది ఇప్పుడు కొత్తతి కాదు అని, అర్బన్ నక్సల్స్ పేరుతో ఒక సెక్షన్ క్రిందకు నెట్టవద్దని పొన్నం కోరారు. ఎర్ర చొక్కా వెసుకున్న వాళ్ళంతా నక్సల్స్ అనడం సరైన పద్దతి కాదని హెచ్చరించారు. ప్రగతిశీల భావాలు కలిగిన తాను నామినేషన్ సందర్భంగా ఎర్ర చొక్కా వేసుకున్నానని వివరణ ఇచ్చారు. అంతమాత్రాన తాను నక్సలైట్ ను అవుతానా? పొన్నం ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News