- Advertisement -
దేశంలో 2022 డిసెంబర్ 31నాటికి దాదాపు 544 మరణ శిక్ష ఖైదీలు వివిధ జైళ్లలో ఉన్నారని మంగళవారం లోక్‌సభలో కేంద్ర హోం సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. వారిలో చాలా మంది సంబంధిత అధికారులకు క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నందున వారి మరణశిక్ష అమలు ఇంకా పెండింగ్‌లో ఉందని వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో 95, గుజరాత్‌లో 49, జార్ఖండ్‌లో 45, మహారాష్ట్రలో 45, మధ్యప్రదేశ్‌లో 39, కర్నాటకలో 32, బీహార్‌లో 27, పశ్చిమబెంగాల్‌లో 26, హర్యానాలో 21, రాజస్థాన్‌లో 20, ఉత్తరాఖండ్‌లో 20, కేరళలో 19, ఆంధ్రప్రదేశ్‌లో 15, తమిళనాడులో 14 మంది మరణ శిక్ష ఖైదీలున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా బండి సంజయ్ తెలిపారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీలో తొమ్మిది, జమ్మూకశ్మీర్‌లో ఎనిమిది మంది ఉన్నట్లు కూడా ఆయన వివరించారు.
- Advertisement -