Wednesday, February 12, 2025

యాదాద్రి ఆలయంలో ఉద్యోగులపై వేటు

- Advertisement -
- Advertisement -

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. విధులకు గైర్హాజరవుతున్నారని ఒకరు, దేవస్థానం సొమ్మును సొంతానికి వాడుకున్నందుకు మరొకరిని ఆలయ ఇఒ భాస్కర్‌రావు సస్పెండ్ చేశారు. దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రావ్య గత 4 నెలల నుంచి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తరచుగా విధులకు గైర్హాజరవుతోంది. ఈ విషయాన్ని గమనించిన ఇఒ విచారణకు ఆదేశించగా సదరు ఉద్యోగిని ఇష్టమొచ్చినట్లు విధులకు వస్తోందని,

కనీసం ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరవుతున్నట్లు తేలింది. ఈ ఆరోపణ నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేశారు. అదేవిధంగాదేవస్థానం సొమ్ములను తమ సొంత అవసరాలకు వాడుకున్న రికార్డు అసిస్టెంట్ నర్సింగరావును కూడా సస్పెండ్ చేసినట్లు ఇఒ తెలిపారు. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో వాహనాలకు టికెట్లు జారీ చేసే కౌంటర్‌లో విధులు నిర్వహిస్తూ వాహనాల ద్వారా వచ్చే డబ్బులను బ్యాంక్‌లో జమ చేయకుండా తన అవసరాలకు వాడుకున్నాడని తేలడంతో అతనిని సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News