తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతూండటంతో చికెన్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లుగా గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనా లను వెనక్కి పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బాయిలర్ కోళ్లను తరలించకుండా
ఆంధ్రా -తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురం క్రాస్ రోడ్‌లోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. బాయిలర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బాయిలర్ కోళ్లను తరలించకుం డా పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. రోజుకు ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున వెటర్నరీ సంబంధిత అధికారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బోర్డర్లో విధుల్లో ఉన్నారు. కాగా, జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద 44వ జాతీయ రహదారిపై అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి మంగళవారం ఎపి నుంచి వచ్చిన రెండు కోళ్ల లారీలను అడ్డుకుని తిప్పి పంపించారు. సోమవారం కూడా ఐదు లారీలను వెనక్కి పంపారు.
భారీగా తగ్గిన చికెన్, గుడ్లు ధరలు
ఎపిలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో 50 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు అంచనా. తూర్పుగోదావరి జిల్లా కానూరులో కోళ్లకు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యింది. బర్డ్‌ఫ్లూ వైరస్ భయం అధికారులు హెచ్చరికలతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఆదివారం కెజి 220 వరకు పలికిన ధరలు మంగళవారానికి రూ.150రూ.170కి తగ్గాయి. బర్డ్‌ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ జోలికి పోవడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్లు ధరలు భారీగా తగ్గాయి. బర్డ్‌ఫ్లూ కేసులు వచ్చిన 10 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో గుడ్లు తినొద్దని సూచించారు. ఈ వైరస్ 3234 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత వద్ద జీవించదని నిపుణులు చెబుతున్నారు. ఎపిలో ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తికి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. చికెన్‌ను 20 నిమిషాల పాటు ఉడికిస్తుం టాం అంటే దాదాపు 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వండుతారు. ఈ ఉష్ణోగ్రతలో వైరస్ బతికే అవకాశం లేదని చెబుతున్నారు. పూర్తిగా ఉడికించిన చికెన్, గుడ్లతో సమస్య ఉండదని చెప్పారు.
మనుషులకు వస్తుందా ?
బర్డ్ ఫ్లూ సోకి చనిపోయి కోళ్లను తిన్నా బర్డ్ ఫ్లూ సోకినట్లుగా తెలియకపోయినా ఆ చికెన్ తిన్నా మనుషులకు కూడా ఆ ఫ్లూ సోకే అవకాశం ఉందన్న రిపోర్టులు ఉన్నాయని చెబుతున్నారు.