ఫిరాయించిన పార్టీ ఎంఎల్‌ఎల
నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు
తప్పవు ఈసారి వారికి ప్రజలే
గుణపాఠం చెబుతారు బిఆర్‌ఎస్
అధినేత కెసిఆర్ పిలుపు
కెసిఆర్‌ను కలిసిన తాటికొండ
రాజయ్య బిఆర్‌ఎస్ తీర్థం
పుచ్చుకున్న పలువురు నేతలు
మన తెలంగాణ/మర్కుక్: పార్టీ మారిన ఎంఎల్‌ఎలకు ప్రజలే సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం, ఎర్రవల్లిలోని కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎంఎల్‌ఎ, మాజీ డిప్యూటీ సిఎం తాటికొండ రాజయ్య నియోజకవ ర్గ ప్రజాప్రతినిధులతో మంగళవారం కెసిఆర్‌తో సమావేశమయ్యారు. కెసిఆర్ స మక్షంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ సిఎం మాట్లాడు తూ..తమ పార్టీ గుర్తుతో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన ఎంఎల్‌ఎల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. ఆ ప్రజాప్రతినిధులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
స్టేషన్ ఘన్‌పూర్‌లో సైతం ఉప ఎన్నిక రావడం తథ్యమని అన్నారు. పార్టీ మారిన కడియం శ్రీహరి ఓడిపోయి.. రాజయ్య ఎంఎల్‌ఎగా గెలవడం ఖాయమని కెసిఆర్ జోస్యం చెప్పారు. అనంతరం మాజీ ఎంఎల్‌ఎ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీన తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో తమ నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మంది కార్యకర్తలు, మండల నాయకుల చేరికల కార్యక్రమం ఉంటుందని అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్, ధర్మసాగర్ మాజీ జడ్‌పిటిసి కీర్తి వెంకటేశ్వర్లు తదితర నాయకులు కెసిఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. వీరిని మాజీ సిఎం సాదరంగా స్వాగతించారు.