Wednesday, February 12, 2025

భార్యతో అసహజ శృంగారం నేరం కాదు: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: భార్య అనుమతి లేకుండా ఆమెతో భర్త అసహజ శృంగారం చేయడం నేరం కిందికి రాదు అని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు వివరించింది. భార్యతో అసహజ శృంగారం చేయడం, ఆ తరువాత ఆమె చనిపోవడంతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భార్య ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా జగదల్‌పూర్‌లోని అదనపు సెషన్స్ న్యాయమూర్తి భర్తకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. భర్త ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ నరేంద్రకుమార్ వ్యాస్ ధర్మాసనం విచారించి తీర్పును వెల్లడించింది. 2013లో ఐపిసి సెక్షన్ 375 సవరణ ప్రకారం నిందితుడి చేసిన పనిని నేరంగా పరిగణించలేమని తీర్పులో పేర్కొంది. భార్య వయసు 15 దాటిని తరువాత భర్త చేసే ఎలాంటి లైంగిక చర్య అత్యాచారం కిందికి రాదని కోర్టు తెలిపింది. సమ్మతి అనే పదానికి ప్రాదాన్యం లేదని, వెంటనే భర్తను జైలు నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News