కేరళ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. కొచ్చి దగ్గర శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. మూడు రోజుల పాటు కేరళ, తమిళనాడులోని పలు పుణ్య క్షేత్రాలను పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు. పవన్ కల్యాణ్ నడుము నొప్పి బాధపడుతుండడంతో రాష్ట్రం సచివాలయంలో మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో సిఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశానికి ఆయన రాలేదు. మంత్రి నాదెండ్ల మనోహర్ కలుగ జేసుకొని పవన్ రెండు వారాలుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారని, అందుకే సమావేశానికి రాలేదని చెప్పారు. రెండు మూడు రోజుల్లో విధులకు హాజరవుతారని వివరణ ఇచ్చారు. వెంటనే చంద్రబాబు స్పందించారు. పవన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించానని, కానీ దొరకలేదని, ఇప్పుడెలా ఉన్నారని బాబు అడిగారు. కాస్త పర్వాలేదని మనోహర్ జవాబిచ్చారు.
Deputy Chief Minister @PawanKalyan , visited the Sri Agastya Maharshi Temple near Kochi in Kerala and took part in special prayers. His son Akira and TTD member Anand Sai also joined him during the visit.#PawanKalyan pic.twitter.com/ePcPgvvVld
— HHVM on March 28th🦅 (@VinayakJSP_) February 12, 2025
కేరళ ఎయిర్ పోర్ట్ లో పవన్ మాస్ ఎంట్రీ! | Pawan Kalyan Mass Entry at Kerala Airport | Prime9 News#pawankalyan #janasena #kerala pic.twitter.com/4DHW3Aufx0
— Prime9News (@prime9news) February 12, 2025