అమరావతి: ఆంధ్రప్రదేశ్ ను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధితో వేల కోళ్లు చనిపోవడం కలకలం సృష్టించింది. బర్డ్‌ఫ్లూ సోకిన 10 కిలో మీటర్ల పరిధిని సర్వెలెన్స్ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అనుమలంకపల్లిలో బర్డ్ ఫ్లూతో 10 వేలకు పైగా కోళ్ల మృత్యువాతపడ్డాయి. ఇవాళ మరో రెండు వేల కోళ్లు మృతి చెందాయి. కోళ్ల శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపారు.
బర్డ్‌ఫ్లూ కలకలంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్‌పోస్టులు, భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట దగ్గర ఒక చెక్‌పోస్టు ఉంది. ఎపి నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. బర్డ్‌ఫ్లూపై రైతులకు అవగాహన కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్‌లో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ కనిపిస్తోంది. భాగ్యనగరంలో చికెన్ అమ్మకాలు 50 శాతానికి పడిపోయాయి. హైదరాబాద్‌లో రోజుకు 6 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయి. కిలో చికెన్ ధర రూ.150కి పడిపోయింది. దీంతో చికెన్ వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు.