హైదరాబాద్ లో రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మూసాపేట్ వై జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని లారీ ఢీకొట్టడంతో యువతి మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు మౌనికగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం యువతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓవర్ స్పీడ్ తో బ్రిజా కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గాయలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సంతోష్ నగర్ కు చెందిన యువకులు మూడు కార్లలో ఫార్మ్ హౌస్ లో ప్రైవేట్ పార్టీకి సంతోష్ నగర్ నుంచి బయల్దేరారు. కారులో చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే కారు ఓవర్ స్పీడ్ తో ఒకేసారి బోల్తా పడింది. బ్రిడ్జి రెయిలింగ్ ను ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. పెద్దగా ప్రమాదం జరగకపోవడంతో కారులో ఉన్న యువకులు ఊపిరి పీల్చుకున్నారు. గాయాలతో బయటపడ్డ యువకులను పోలీసులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.