Wednesday, February 12, 2025

ఛాంపియన్ ట్రోఫీకి భారత్ జట్టు ఇదే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా వెన్ను నొప్పి గాయంతో బాధపడుతుండడంతో అతడిని జట్టులోకి తీసుకోలేదు. బుమ్రాకు బదులుగా హర్షిత్ రాణాకు స్థానం కల్పించారు. ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలోనే ఉన్నాడు. అతడి ఫిట్‌నెస్ సందేహాలు ఉన్నాయి. యశస్వి జైస్వాల్ స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తుది జట్టులోకి తీసుకున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి బుమ్రా తరువాత ఎక్కువ వికెట్లు తీసుకున్న సిరాజ్ ఎందుకు తీసుకోలేదని క్రికెట్ పండితులు ప్రశ్నిస్తున్నారు. సిరాజ్ కు మొండి చేయి చూపడం అనేది మంచిది కాదుని సీనియర్ ఆటగాళ్లు హితువు పలుకుతున్నారు.

టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్(కీపర్), రిషభ్ పంత్(కీపర్), హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి

నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు: యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శివం దూబె

Team India players for Champion trophy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News