Wednesday, February 12, 2025

ఎపిలో పెట్టుబడులకు అవకాశాలు ఎక్కువ: నారా లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపిలో పెట్టుబడులకు సిఫి చైర్మన్ సుముఖత వ్యక్తం చేశారని మంత్రి లోకేష్ తెలిపారు. సిఫి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజుతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో లోకేష్ మాట్లాడారు. విశాఖలో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై సమావేశం జరిపామన్నారు. ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి లోకేష్ వివరించారు. దీంతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సేవలపై సిఫీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజుకు వివరణ ఇచ్చామన్నారు. నూతన ఐటి పాలసీల తీసుకొస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News