బెంగళూరు : ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 10 వ అంతర్జాతీయ మహిళా సదస్సుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు జరగనున్న ఈ సదస్సుకు రాజకీయ, వ్యాపారం, కళలు, సామాజిక రంగాలకు చెందిన అత్యంత ప్రభావవంతమైన మహిళలు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు 60 మందికి పైగా వక్తలు, 500 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారు. దాదాపు రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఈ సదస్సు ద్వారా 115 దేశాల నుంచి 463 మంది ప్రముఖ వక్తలను, 6000 మంది ప్రతినిధులను ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఏకతాటిపైకి చేర్చింది. ఈ ఏడాది రాష్ట్రపతితోపాటు, కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లాత్, కేంద్ర మంత్రులు అన్నపూర్ణాదేవి, శోభా కరంద్లాజే, మీనాక్షి లేఖి పాల్గొననున్నారు.అలాగే కామన్వెల్తు సెక్రటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్, జపాన్ మాజీ ప్రధాని సతీమణి అకీ అబే, చిత్రదర్శకుడు అశ్వినీ అయ్యర్ తివారీ, నటీమణులు హేమమాలిని, షర్మిలా ఠాగూర్, బాలీవుడ్ తారలు సారా అలీ ఖాన్, సోనాక్షి సిన్హా,రాధికా గుప్తా, కనికా టేక్రివాల్ తదితర ప్రముఖులు విచ్చేయనున్నారు.
14 నుంచి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ అంతర్జాతీయ మహిళా సదస్సు..హాజరు కానున్న రాష్ట్రపతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -